సామాజిక స్పృహ, అంకితభావం ఉండి దేశానికి ఉపయోగపడాలని అభిలషించే నవ యువత మొదటి మొగ్గు సివిల్స్‌కే! ఆశావహ దృక్పథం, సరైన ప్రణాళిక, సహనం, సుదీర్ఘకాలం కష్టపడే స్వభావం ఉంటేనే దేశంలోని అత్యుత్తమమైన సివిల్ సర్వీసుల్లో ప్రవేశించగలుగుతారు. పరీక్షా పద్ధతి మారిందని నిరాశపడకుండా దానికి తగ్గట్టుగా తమను మల్చుకోగలిగితే తెలుగు మీడియం విద్యార్థులకూ సివిల్స్ శిఖరారోహణ సుసాధ్యమే అంటున్నారు బ్రెయిన్ ట్రీ గోపాలకృష్ణ !
సివిల్ సర్వీసుల ప్రకటన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రానుంది. ఈలోపు పకడ్బందీగా పూర్వరంగం సిద్ధం చేసుకుంటే సులభంగా కార్యాచరణలోకి అడుగుపెట్టవచ్చు. గత ఏడాదే ప్రవేశపెట్టిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష మార్పుల గురించి తెలుసుకుంటే స్పష్టత ఏర్పడుతుంది.
గతంలో ప్రిలిమినరీ ఐచ్ఛిక (ఆప్షనల్) పేపర్ 300 మార్కులకూ, జనరల్ స్టడీస్ పేపర్ 150 మార్కులకూ ఉండేవి. ఆప్షనల్‌లో 120 ప్రశ్నలు. ప్రతి సరైన జవాబుకూ రెండున్నర మార్కులు. జనరల్‌స్టడీస్‌లో సరైన జవాబుకు మార్కు చొప్పున 150 ప్రశ్నలు. తప్పు జవాబులకు 0.33 మార్కుల తగ్గింపు (మైనస్) ఉండేది. ఈ విధానంలో డిగ్రీలో చదివిన సబ్జెక్టును ఆప్షనల్‌గా తీసుకునే వీలుండటం వల్ల తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేది. ఇంగ్లిష్‌లో ప్రశ్నలున్నప్పటికీ తెలిసివున్న సబ్జెక్టు కాబట్టి తేలిగ్గా రాయగలిగేవారు. ప్రతికూలతల్లో ప్రధానమైనది ఏమిటంటే... ఆప్షనల్స్ కటాఫ్ మార్కుల్లో రకరకాల తేడాలుండటం, కొన్ని మాత్రమే ఎక్కువ స్కోరింగ్‌గా ఉండి అభ్యర్థులందరికీ సమన్యాయం లభించకపోవటం. దీంతో సివిల్స్‌లో ఉమ్మడి (కామన్) పేపర్లు అవసరమనే వాదనకు మద్దతు ఏర్పడింది. ఫలితంగా 2011లో మార్పులు అమలయ్యాయి.
రెండు కామన్ పేపర్లు
సివిల్స్ అభ్యర్థులందరూ ఇప్పుడు రెండు కామన్ పేపర్లు రాయాలి.
1) జనరల్ స్టడీస్ పేపర్-1:
వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్, భారతదేశ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ- పాలన, జనరల్ సైన్స్, సాంఘిక ఆర్థికాభివృద్ధి, భారత, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు.
2) జనరల్ స్టడీస్ పేపర్-2:
కాంప్రహెన్షన్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్- కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్- అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్- ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ (పదో తరగతి స్థాయి), డేటా ఇంటర్‌ప్రెటేషన్ (పదో తరగతి స్థాయి), ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ (పదో తరగతి స్థాయి)
యూపీఎస్‌సీ నుంచి ప్రశ్నల సంఖ్య గురించి కానీ, ప్రశ్నల శైలి గురించి కానీ ఎలాంటి సమాచారం రాలేదు. కొన్ని నమూనా ప్రశ్నలు మాత్రం ఇచ్చి ఊరుకున్నారు. దీంతో ఏ తరహా ప్రశ్నలు వస్తాయో ఎవరికీ అర్థం కాలేదు. అనిశ్చిత స్థితిలోనే అభ్యర్థులు పరీక్ష రాయాల్సివచ్చింది.
నిరాశాపూరితం
ఈ ఏడాది జూన్ నెల్లో ప్రిలిమినరీ పరీక్ష కొత్త విధానం అభ్యర్థులకు తొలిసారి అవగతమయింది. నూతన పద్ధతి నిరాశాపూరితంగా ఉందనటం అనుచితమైన వ్యాఖ్య ఏమీ కాదు. ప్రశ్నపత్రం సృజనాత్మకంగా లేదు; క్లిష్టంగానూ లేదు. ప్రచారం జోరుగా సాగిన సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలేమీ లేవు.
పేపర్-1 యథాప్రకారం కఠినంగా ఉంది. సూక్ష్మాంశాలతో కూడి ఉండటం వల్ల 50 శాతం కంటే మించి ఏ అభ్యర్థీ కచ్చితంగా జవాబులు గుర్తించలేకపోయారు. ఇలాంటి స్థితిలో పేపర్-2లో 75 శాతం తెచ్చుకున్నవారే పాసయ్యారు. ఉత్తీర్ణతకు అవసరమైన సాధారణ స్కోరు 200/ 400.
ఇంగ్లిష్‌లో మంచి ప్రావీణ్యమున్న పట్టణ విద్యార్థులకే ప్రశ్నపత్రం అనుకూలించినట్టుగా ఫలితాల తీరు తెలిపింది. నిజానికి గత పరీక్షా విధానంలో పరీక్షకు హాజరైవున్న చాలామంది నెగ్గలేకపోగా; అంతగా సిద్ధం కాకుండానే పరీక్ష రాసిన ఎక్కువమంది ఉత్తీర్ణులయ్యారు. ప్రాంతీయ భాషల మీడియంలో డిగ్రీ చదివినవారు విజయానికి దూరం కాగా, పట్టణ విద్యార్థులే ఎక్కువమంది విజేతలుగా నిలిచారు.
తెలుగు మీడియం విద్యార్థులు ఏం గమనించాలి?
* ఇంగ్లిష్ అంత సరిగా రాకుంటే ఈ భాష నేర్చుకోవటానికి కృషి చేయాల్సిందే. ఇంగ్లిష్ ప్రాథమికాంశాలను నేర్చుకోవడానికి సిగ్గుపడాల్సిన పని లేదు.
* పాఠశాల పుస్తకాల్లోని ప్రాథమిక వ్యాకరణం చదివి భాషను మెరుగుపర్చుకోవచ్చు. వాక్యనిర్మాణం అర్థం చేసుకోవటం, వాక్యాల భావాన్ని సరిగా బోధపరుచుకోవటం అవసరం.
* ఇంగ్లిష్‌లో ప్రాచుర్యం పొంది, తెలుగులోకి కూడా అనువాదం పొందిన పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. మొదట ఆంగ్ల భాగం చదివి, దాన్ని తెలుగులోకి మార్చాలి. సరిగా వచ్చిందో లేదో తెలుగు అనువాదంతో పోల్చి చూడాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ప్రక్రియను ఆసక్తిగా సంతోషంతో చేయాలి గానీ 'తప్పదు కదా' అనే ఉద్దేశంతో కాదు.
* పాత బ్యాంకింగ్ పరీక్షల నుంచి కాంప్రహెన్షన్ పాసేజ్‌లను తీసుకుని, జవాబులు రాయటం సాధన చేయాలి.
* మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్ విభాగాల నుంచి ఎక్కువ స్కోర్ చేయటానికి ప్రయత్నించండి. వీటికి ఇంగ్లిష్‌తో సంబంధం లేదు.
* వీలైనంత త్వరగా ప్రిపరేషన్ మొదలుపెడితే ఇంగ్లిష్ నైపుణ్యాలు పెంచుకోవటానికి వ్యవధి చిక్కుతుంది.
* పేపర్-1లో మార్కులను గరిష్ఠంగా పెంచుకోవటానికి ప్రయత్నించాలి. పేపర్-2 అంశాలు మీకెటూ ఇబ్బంది కావు.
* సాధన చేసేటపుడు పొరపాట్లపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే... చేసే ప్రతి పొరపాటూ మార్కులను కోల్పోయేలా చేస్తుందని మరవకూడదు.

సివిల్స్ మెయిన్స్ మెలకువలివిగో!
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు దగ్గర్లోకి వచ్చేశాయి.
దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ, ఆందోళన!
పరీక్షను అర్థం చేసుకుని, విజయసూత్రాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే 'సన్నద్ధత' ప్రయాణం సాఫీగానే సాగుతుంది. ఆ వివరాలను అందిస్తూ పునశ్చరణను పరిపుష్టం చేసుకునే విధానం వివరిస్తున్నారు... బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ గోపాలకృష్ణ
సివిల్స్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది కాబట్టి అది చాలా తేలికనే అభిప్రాయం చాలామందిలో కనిపిస్తుంది. నిజానికి కష్టమైన పరీక్ష ఇదే. ప్రిలిమినరీలో ప్రతి మార్కూ విలువైనదే. ఒక్క మార్కే అభ్యర్థి పోటీలో ఉండటాన్నీ, వైదొలగటాన్నీ నిర్ణయించే అవకాశముంది. పైగా మొదటిసారి ప్రిలిమ్స్‌లో నెగ్గనివారిలో ఆ కారణం మానసికంగా కొంత అవరోధాన్ని ఏర్పరిచే ప్రమాదం ఉంటుంది.
అందుకే ప్రిలిమ్స్ దశ దాటినవారు పెద్ద 'హర్డిల్' దాటేసినందుకు తమ భుజం తామే తట్టుకోవచ్చు! ఇక రెండో దశ అయిన మెయిన్స్ విషయానికి వస్తే... దీనిలో సాధించిన మార్కులు అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వారు ఇంటర్వ్యూకు అర్హత పొందుతారా? ఏ సర్వీసుకు ఎంపికవుతారు? ఐఏఎస్‌కో, ఐపీఎస్‌కో ఎంపికైతే ఏ రాష్ట్రంలో పనిచేస్తారు?... ఇవన్నీ!
ప్రతి మార్కూ ఇక్కడ కూడా పరిగణనలోకి వచ్చేదే. అయితే ఎక్కువ పేపర్లుంటాయి కాబట్టి ఒక పేపర్లో తక్కువ మార్కులు వచ్చినా మరో పేపర్లో అత్యధిక స్కోరు తెచ్చుకుని సర్దుబాటు చేసుకోవచ్చు.
ఆప్షనల్స్ ప్రత్యేకత
మెయిన్ పరీక్షలో తొమ్మిది పేపర్లుంటాయి. వాటిలో ఐదు తప్పనిసరి (కంపల్సరీ). మిగిలిన నాలుగూ అభ్యర్థి ఎంచుకునే ఆప్షనల్స్. ఈ ఆప్షనల్ సబ్జెక్టుల ప్రత్యేకత ఏమిటి? గత మూడేళ్ళ ఫలితాల్లో టాపర్ల మార్కులను పరిశీలిస్తే... అందరూ ఆప్షనల్స్‌లో చాలా అధిక మార్కులు స్కోర్ చేసినవారే! ఆశ్చర్యకరంగా జనరల్ స్టడీస్‌లో అందరికీ తక్కువ మార్కులే వచ్చాయి.
ఇది దేన్ని సూచిస్తోంది?
జనరల్ స్టడీస్ చాలా విస్తృతం కాబట్టి దీనిలో స్కోర్ చేయటం చాలా కష్టం. ఈ క్లిష్టత అభ్యర్థులందరిదీ! ఈ పేపర్ పూర్తిగా అనూహ్యంగా ఉండొచ్చు. ఎంత విస్తారంగా చదివినా, ఎన్ని కోచింగ్ తరగతులకు హాజరైనా... ప్రశ్నపత్రం అదివరకెన్నడూ ఎరగనిది చూసినట్టు అనిపిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.
ఇలాంటపుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరికీ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి విచారించనక్కర్లేదు. అందుకే 2000 మార్కులున్న ఆప్షనల్స్ మీద దృష్టి కేంద్రీకరిస్తే 1200 మార్కులు (60 శాతం) తెచ్చుకునే అవకాశం ఉంది. ఇతర పేపర్లలో అనూహ్య ప్రశ్నలు ఎక్కువ కాబట్టి ఆప్షనల్స్ మార్కులు 60 శాతమైనప్పటికీ, అభ్యర్థి విజయంలో వాటి పాత్రను 75 శాతం వరకూ లెక్కలోకి వేసుకోవచ్చు. ఈ రకంగా ఆప్షనల్స్‌లో వచ్చే మార్కులకు నేరుగా ర్యాంకుతోనే సంబంధం ఉంటుంది!
మన రాష్ట్రంలో సివిల్స్ విజేతల్లో ఎక్కువమంది ఎంచుకునే ఆప్షనల్స్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రపాలజీ, తెలుగు సాహిత్యం, భూగోళశాస్త్రం ఉన్నాయి. తొలిసారే అర్హత పొందినవారిలో అధికశాతం ఎంపిక- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రపాలజీలే. దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందిన ఆప్షనల్- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. గత ఏడాది విజేతలైన 900 + అభ్యర్థుల్లో 400+ మంది ఆప్షనల్ ఇదే! ఈ ఏడాది మెయిన్స్‌కు హాజరయ్యే 12,000 మంది అభ్యర్థుల్లో 6,500కి పైగా ఈ సబ్జెక్టునే ఆప్షనల్‌గా ఎంచుకోవటం విశేషం. ఈ సబ్జెక్టు సిలబస్‌ను రెండు పేపర్లుగా విభజించారు. మొదటి పేపర్‌లో అడ్మినిస్ట్రేటివ్ థియరీ, రెండోదానిలో భారతీయ పాలనావ్యవస్థ. రెండూ స్కోరింగ్‌కు అనుకూలమైనవే. ప్రతి పేపర్లోనూ 300కు 200 మార్కులు తెచ్చుకున్నవారున్నారు. వీరి వ్యూహం ఏమిటంటే...
1) స్కోరింగ్ అంశాలను గుర్తించటం
2) ఈ అంశాల్లోని వర్తమాన పరిణామాలను చదవటం
3) జవాబులు రాసే తీరుపై దృష్టి పెట్టటం
పేపర్-1: మొదటి విభాగం (సెక్షన్)లో తొలి ఆరు అధ్యాయాలూ, రెండో విభాగంలో మిగిలిన ఆరు అధ్యాయాలూ ఉంటాయి. మొదటి విభాగం అధిక స్కోరింగ్ కాబట్టి ఈ అధ్యాయాలపై అధిక దృష్టి కేంద్రీకరించవలసివుంది.
పేపర్-2: తొలి ఏడు అధ్యాయాలూ సెక్షన్-ఎలో, మిగిలిన ఏడు అధ్యాయాలూ సెక్షన్-బిలో ఉంటాయి. దీనిలో పేపర్-1 మాదిరి కాకుండా రెండో విభాగంలోనే అధిక మార్కులు స్కోర్ చేసే అవకాశముంది.
గత కొద్ది సంవత్సరాల ప్రశ్నపత్రాల ఆధారంగా కింది ధోరణులను గుర్తించవచ్చు.
* గతంలో కనీసం నాలుగు వ్యాసరూప (ఎస్సే) ప్రశ్నలుండేవి. ఈ తీరు మారుతోంది. ఎస్సే ప్రశ్నలు చిన్న ప్రశ్నలుగా మారుతున్నాయి. దీనిబట్టి గ్రహించాల్సింది ఏమిటంటే... అభ్యర్థులు కొన్ని అంశాలను వదిలివేసే అవకాశం లేదిప్పుడు. అన్నిటినీ చదివి తీరాల్సిందే!
* కొన్ని areasలో ప్రశ్నలు పరోక్షంగా ఉంటాయి. అవి అంత స్కోరింగ్ కావు. కానీ కొన్ని areasలో నేరుగా వచ్చే ప్రశ్నలుంటాయి. అవి స్కోరింగే. సమస్యేమిటంటే... ఈ areasచదవటానికి విసుగ్గా ఉంటాయి. బోరింగ్... కానీ స్కోరింగ్! అందుకే అభ్యర్థులకు మరో అవకాశం లేదని గుర్తుంచుకోండి.
* ప్రశ్నల విధానం ఏటా మారుతుంటుంది. ఇటీవల 10-15 మార్కులుండే short questions ఇవ్వటంపై దృష్టి పెరిగింది. దీనికి సిద్ధంగా ఉండాలి.
* సరికొత్త పరిణామాలను తెలుసుకుంటూ ఉండాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గతిశీలమైనది, రోజూ నూతన సంఘటనలు చోటుచేసుకునే సబ్జెక్టు. అతి ముఖ్యమైన అంశాలను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి.
* గత సంవత్సరాల ప్రశ్నపత్రాల ఆధారంగా ముఖ్యమైన అంశాల జాబితా తయారుచేసుకోవాలి. వాటిపై అధిక దృష్టి పెట్టాలి. అయితే పేపర్ రూపొందించేవారు మనకంటే తెలివైనవారైవుంటారు కాబట్టి ఏ అంశాన్నీ వదిలెయ్యకుండా జాగ్రత్తపడాలి.
* 'ఇండియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్' నుంచి సంబంధమున్న వ్యాసాలను చదవాలి. వాటి నుంచి చాలా ప్రశ్నలు ఆశించవచ్చు.
* పరీక్షలో ఎన్ని వీలైతే ప్రశ్నలకు జవాబులు రాయాలి. ప్రశ్నకు నేరుగా స్పందించలేకపోయినప్పటికీ ఆ అంశం గురించి ఏదో ఒకటి రాయటం మేలు. ఆ అంశానికి సంబంధించిన ముఖ్య కోణాల గురించి రాసినప్పటికీ కనీసం 40 శాతం మార్కులైనా వచ్చే అవకాశం ఉంటుంది.

సివిల్ సర్వీసెస్ పరీక్షలో మన రాష్ట్ర విద్యార్థులకు తప్పనిసరి పేపర్‌గా మాతృభాష తెలుగు ఉంది. ఇది అర్హత పరీక్ష మాత్రమే అయినా నిర్లక్ష్యం వహిస్తే అర్హత కోల్పోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు డా. ద్వా.నా. శాస్త్రి.
అర్హత పరీక్షగా తెలుగు 300 మార్కులకు జరుగుతుంది. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. అయితే నలబై శాతం మార్కులు తెచ్చుకోవాల్సివుంటుంది. అంటే 120 మార్కులు! 'ఈ మాత్రం రావా?' అనే నిర్లక్ష్యం పనికిరాదు. అశ్రద్ధ వల్ల 'క్వాలిఫై' అవ్వని అభ్యర్థులూ ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు.
'క్వాలిఫైయింగ్' తెలుగులో మొత్తం ఆరు ప్రశ్నలుంటాయి.
1) 300 పదాలతో వ్యాసం - 100 మార్కులు 2) ఒక ఖండిక ఇచ్చి చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయటం- 60 మార్కులు 3) ఒక ఖండికను మూడోవంతు పరిమాణానికి తగ్గించి రాయటం- 60 మార్కులు 4) ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించటం- 20 మార్కులు 5) తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించటం - 20 మార్కులు 6) ఎ) జాతీయాలను సొంత వాక్యాల్లో ప్రయోగించటం- 20 మార్కులు బి) సమానార్థక పదాలు రాయటం- 20 మార్కులు
పదో తరగతి స్థాయికి తగినది అని చెపుతున్నా నిజానికి ఈ పేపర్ డిగ్రీ స్థాయికి చెందినదే. పైగా ఆంగ్లమాధ్యమంలో చదువుతున్న అభ్యర్థులకు తెలుగు రాసే అలవాటు అంతగా ఉండదు. అందుకే ఈ పేపర్‌ను తేలిగ్గా తీసుకోవటం, నిర్లక్ష్యం చేయటం సరికాదు.
మొదటి ప్రశ్న
ఇది 'జనరల్ ఎస్సే'కి సంబంధించినది. సుమారు 300 పదాల్లో రాయమన్నారు కాబట్టి ఓ ఇరవై పదాలు ఎక్కువైనా, తక్కువైనా పట్టించుకోరు. తక్కువ రాయటం కంటే ఇరవై పదాలు ఎక్కువైనా ఫరవాలేదనుకోవాలి. లెక్కపెట్టి మరీ రాయనవసరం లేదు.
ఒక పేజీ రాసినతర్వాత సుమారుగా ఎన్ని పదాలు వచ్చాయో చూసుకుని దాని ప్రకారం రాయవచ్చు. వంద మార్కులున్నాయి కాబట్టి ఆచితూచి రాయాల్సివుంటుంది. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే... ఐదు ప్రశ్నల్లో ఒకటే రాయటం. 'చాయిస్' ఎక్కువుంది కాబట్టి దిగులు చెందనక్కర్లేదు.
నేపథ్యం, ప్రారంభం, విషయ వివరణ, అనుకూల ప్రతికూల అంశాలు, ప్రస్తుత స్థితి, సూచనలు, ముగింపు... అనేవాటిపై దృష్టి ఉంచి వ్యాసం రాయాలి. పెద్దల మాటలనూ, కవుల వాక్యాలనూ, సామెతలనూ, జాతీయాలనూ ప్రయోగిస్తే మార్కులు ఎక్కువ సంపాదించవచ్చు. అనుకూలమైనా, ప్రతికూలమైనా చర్చించే పద్ధతిని బట్టి మార్కులుంటాయి. సోదాహరణంగా వివరిస్తే స్పష్టత సాధించవచ్చు.
రెండో ప్రశ్న
చివరలో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు- పైన ఇచ్చిన ఖండికలోనే ఉంటాయి. జాగ్రత్తగా చదివితే చాలు. అయితే సమయం ముఖ్యమని మర్చిపోకూడదు. ఖండికలో ఉన్నట్టే రాయక్కర్లేదు- 'మీ సొంత మాటల్లో' రాయాలని సూచిస్తారు.
మూడో ప్రశ్న
ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇచ్చిన ఖండికను మూడో వంతు పరిమాణానికి తగ్గించి సంక్షిప్తంగా రాయాలి. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రత్యేకంగా ఇచ్చిన కాగితాలపైనే రాసి ప్రధాన సమాధాన పత్రానికి జత చేయాలి. మూడోవంతుకు తక్కువైనా, ఎక్కువైనా తగిన విధంగా మార్కులుంటాయన్న హెచ్చరికను గమనించాలి. కాబట్టి మొత్తం పంక్తులు లెక్కబెట్టి మూడో వంతుకు ఎన్ని పంక్తులు వస్తాయో ముందుగానే సరిచూసుకోవాలి. ఇలా సంక్షిప్తం చేయడమంటే ఇచ్చిన సమాచారంపై అవగాహన ఉండాలని భావం. రెండు మూడు వాక్యాల్లో ఉంటే ఒక వాక్యంగా కుదించాలి. భావం మారకుండా, సొంత కవిత్వం లేకుండా రాయాలి. ఇందుకు సామెతలు, జాతీయాలు తోడ్పడతాయి. రెండు మూడుసార్లు చదివినతర్వాతనే సంక్షిప్త రచన చేపట్టాలి.
అనువాదం
ఆంగ్లం నుంచి తెలుగులోకీ, తెలుగు నుంచి ఆంగ్లంలోకీ అనువదించమనే ప్రశ్నలుంటాయి. అనువాదం ఎప్పుడూ యథాతథానువాదం కాకూడదు. అంటే మక్కీకి మక్కీ ఉండకూడదు. భావాన్ని సొంతమాటల్లో చెప్పాలి. అనువాదంలా కాకుండా 'అనుసృజన' లాగా ఉండాలి.
రెండు వాక్యాల్లో ఉంటే ఒక వాక్యంలో చెప్పవచ్చు. సరైన పదాలు తట్టకపోతే మూలపదాలను అలాగే రాసి కొటేషన్లలో రాయవచ్చు. ఆంగ్లపదాలను రాయాల్సివస్తే ఆంగ్లంలో కాకుండా వాటిని కొటేషన్లో ఉంచి తెలుగులో రాయాలి. ఉదా: 'కంప్యూటర్', 'అడ్మినిస్ట్రేషన్', 'ఇంటర్వ్యూ' మొదలైనవి. అనువాదంలో భాషానుగుణమైన పదప్రయోగాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆంగ్లంలో staying at hotel అంటారు. దీన్ని తెలుగులో రాసేటప్పుడు 'హోటల్ వద్ద' అనకుండా 'హోటల్‌లో'బస చేస్తున్నాడనాలి. ఆంగ్లంలోని 'బ్రెడ్' అనే మాటను సందర్భాన్నిబట్టి 'ఆహారం' అని మార్చాల్సివుంటుంది. ఇలాంటి మెలకువలు గ్రహించాలి.
సొంతవాక్యాల్లో జాతీయాలు
ఇది ఎంత తేలికో అంత కష్టమైనది. జాతీయాలను సొంత వాక్యాల్లో ప్రయోగించటమంటే లోకజ్ఞానం, సందర్భం తెలిసివుండాలి. జాతీయం అనేది రెండు మూడు పదాల కలయిగా ఉండే పదబంధం. ఆంగ్లంలో 'ఇడియమ్' అంటారు. అసలైన అర్థం కాకుండా దానికి సంబంధించి మరో అర్థం వస్తుంది.
'కళ్ళల్లో కారం పోసుకోవడం' అంటే నిజంగా ఆ అర్థం కాదు. ఈర్ష్య పడటం, అసూయపడటం, ఓర్వలేకపోవడం అని. దీన్ని గ్రహించి వాక్యంలో ప్రయోగించాలి.
* వడ్డించిన విస్తరి: అధికారం, సంపద గలవారి జీవితం వడ్డించిన విస్తరి వంటిది.
* నత్తనడక: ప్రభుత్వ ప్రణాళికలు చాలావరకూ నత్తనడక నడుస్తున్నాయి.
* చెవి కోసుకోవడం: కథలంటే మా అన్నయ్య చెవి కోసుకుంటాడు.
అమృతము= పీయూషము, సుధ
కలువ= ఉత్పలము, కల్హారం, కుముదం
మనుష్యుడు= మానవుడు, మనుజుడు, మర్త్యుడు, నరుడు, పురుషుడు
వాయువు= గాలి, మారుతము, పవనము, అనిలం, సమీరం
ఈ విధంగా తెలుగు అర్హత పరీక్ష ఉంటుంది. జనరల్‌స్టడీస్, ఆప్షనల్స్ ఎంత బాగా చదివినా, ఎంత బాగా రాయగలిగినా మాతృభాషలో అర్హత పొందకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరు విధం అవుతుంది. కాబట్టి మెయిన్స్‌కు సన్నద్ధమయ్యేవారు దీనిపై దృష్టి పెట్టడం అవసరం.
ఒక్కమాట- తెలుగులో రాయటం అంటే వాడుకభాషలో రాయటమే. పత్రికాభాషలో రాయటమే!

అక్టోబరు చివరి వారంలో సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి.
పునశ్చరణ పకడ్బందీగా పూర్తిచేసినవారు ఇప్పుడున్న పరిమిత సమయంలో చేయాల్సింది- అత్యంత ముఖ్యమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించటం. దీనివల్ల మెరుగైన ఫలితం లభిస్తుంది.
వివిధ సబ్జెక్టుల్లో అలాంటి ముఖ్యమైన టాపిక్స్ జాబితా ఇది... (దీన్ని తయారుచేసినవారు-‘బ్రెయిన్ ట్రీ’ గోపాలకృష్ణ).
HISTORY:
• The Constitution and Sardar Patel. • Growth of Education in India. • Causes for the rise of revolutionary terrorism in the early decade of the 20th Century.
CULTURE :
* Vedic Divinities * Samhitas * Vihara Constructions * Minhaj–Us-Siraj * Ravi Verma * Tulsi Das * Onam * Vivekananda Rock Memorial * Sriranga Patnam * Kathakali * Kosambhi * Nathadwara * Nandalal Bose * Purandaradasa * Manasarova * Pinjore Garden.
GEOGRAPHY / ECONOMIC GEOGRAPHY:
• Bio-diversity and conservation • Floods. • Earthquakes and Tsunamis • Fukushima Nuclear Disasters • Global Warming • India’s stand on Climate change. • National Action Plan on Climate Change its merits and demerits. • Jawaharlal Nehru National Solar Machine. • Sustainable Management of Natural Resources. • Challenges of urbanization etc. • Energy • Promoting Energy Efficiency.
POLITY:
• Comptroller and Auditor General • Judiciary • ‘State politics’ Vs ‘National politics’ • Lokpal Bill • Khap Panchayats • Central Bureau of Investigation • Terrorism • Issues with reference to the Right to Information Act.
ECONOMY:
• Macro Economic Frame Work • Inflation Vs Growth • Black Money • Public Distribution System • Goods and Services Tax • Twelfth Five Year Plan • Fuel Price Hike • Direct Taxes Code • Flagship Programmes like MGNREGA, NRHM, etc.
CURRENT AFFAIRS AND SOCIAL PROBLEMS:
• Corruption • Paid News • Caste Census • Inter-State River Water disputes • Micro Finance • Internal Security • India’s Nuclear Doctrine • Problems of the aged • Ethical Issues involved in Stem Cell Research. • Central Strategy to deal with Naxalism. • National Knowledge Commission and Indian Systems of Medicine. • Recent Measures for Social Protection. • Racial Attacks • Social Networking • Social Audit • Exclusion of Women from Productive Employment • National Innovation Council.
INDIA AND THE WORLD:
• Directions of India’s Foreign Policy • East Asia summit. • Indo-US relations • Indo-French • SAARC • Indian Diaspora in ‘Cyber – Space’. • Indian Diasporic Writing. • Chinese Diaspora Vs. the Indian Diaspora • Asean • G-8 • UN Forum for Women.
SCIENCE AND TECHNOLOGY:
• Mile stones in India’s Space Programme
• Health Care in India • Super Bug • India’s Super Computer • Global Environment and Disaster Management • National Ganga River Basin Project • National Green India Mission • E.Coli.
PEOPLE / EVENTS / PROGRAMMES / PLACES IN THE NEWS:
• Dr. Binayak Sen • M.F. Hussain • Harish Hande • Kisan Babu Rao Hazare • Satya Sai Baba • Narayana Murthy • Angela Merkel. • Goran Hadzic

సివిల్ సర్వీసెస్ మెయిన్స్... సిసలైన సత్తాను పరీక్షకు పెట్టే డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే పరీక్ష!
దీనిలో విజయవంతమైతే సివిల్స్ ప్రస్థానంలో విజయానికి దాదాపు చేరువైనట్లే. వచ్చేనెల చివరివారంలో ఈ పరీక్ష ప్రారంభమవుతున్న సందర్భంగా అత్యధిక మార్కులను స్కోరు చేసే వ్యూహం వివరిస్తున్నారు గోపాలకృష్ణ.
తగిన పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉన్నంతమాత్రాన ఎవరూ ఉత్తమ సివిల్ సర్వెంట్లు కాలేరు. అంకితభావం, సామాజిక అంశాలపై స్పందన, రాజ్యాంగ ఆదర్శాలపట్ల నిబద్ధత మొదలైన విలువలు ప్రధానం. ఇలాంటివారిని గుర్తించే లక్ష్యంతోనే సివిల్స్ నియామక ప్రక్రియ పనిచేస్తుంది.
తొమ్మిది పేపర్లతో డిస్క్రిప్టివ్ విధానంలో సాగే మెయిన్స్ పరీక్ష 20 రోజుల వ్యవధిలో ముగుస్తుంది. అభ్యర్థుల విద్యాపరమైన ప్రతిభను మాత్రమే కాకుండా వారి సమన్వయ సామర్థ్యాన్నీ, స్వీయ పరిజ్ఞానాన్ని స్పష్టంగా సమర్పించే తీరునూ పరీక్షించేలా మెయిన్స్‌ను రూపొందించారు.
క్వాలిఫైయింగ్ పేపర్లు
అభ్యర్థి ప్రాథమిక నైపుణ్యాలను మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్, జనరల్ ఇంగ్లిష్‌లలో పరీక్షిస్తారు. ఈ పేపర్లలో మార్కులను ర్యాంకింగ్‌కు లెక్కించరు కానీ, వీటిలో కనీసం 33 శాతం మార్కులు తెచ్చుకోవటం తప్పనిసరి.
* మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్: తెలుగు/ హిందీ రాయటం తగ్గిపోయిన అభ్యర్థులు చాలామందే ఉంటారు. ఇలాంటివారు రోజుకు కనీసం అరగంటైనా రైటింగ్ సాధన చేయాల్సివుంటుంది. భాషను సాధన చేయటం కోసం అక్టోబరు 1 నుంచి రోజుకు అరగంట చొప్పున వారానికి 4 రోజులు కేటాయించుకోవాలి. తెలుగుమీడియంలో డిగ్రీ చేసినవారూ, తెలుగు సాహిత్యం ఐచ్ఛికంగా ఉన్న విద్యార్థులూ ఈ పేపర్‌పై ఎక్కువ సమయం వెచ్చించనక్కర్లేదు.
* జనరల్ ఇంగ్లిష్: మన రాష్ట్ర విద్యార్థుల్లో చాలామందికి ఈ పేపర్ సమస్యే కాదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన గ్రామీణప్రాంతాల్లో ఇంగ్లిష్ బోధన మెరుగేనని చెప్పాలి. కాబట్టి తెలుగుమీడియం నేపథ్యం వారు కూడా దీనికి ఎక్కువగా సన్నద్ధం కానక్కర్లేదు. గత సంవత్సరాల పేపర్లు చూసి, మానసికంగా సిద్ధమవ్వాలి.
జనరల్ ఎస్సే
ర్యాంకును సాధించటంలో వ్యాసం పాత్ర నిర్ణయాత్మకం. చాలామంది టాపర్లు సగటు మార్కుల కంటే అధికంగా తెచ్చుకునే పేపరిది. గరిష్ఠమార్కులు పొందాలంటే తగిన అంశాన్ని ఎంచుకోవటం, క్రమపద్ధతిలో దాన్ని విశ్లేషించటం అవసరం.
ఈ ఏడాది ఆశించదగ్గ టాపిక్స్:
1) Role of Audit in Democratic India
2) Judicial Accountability and Democracy
3) Food Security, Food inflation and Public Distribution System
4) What the Next five year Plan should focus upon Five priority items
5) Information Technology for the Masses: Bridging the Digital Divide
స్కోరు సాధించేదెలా?
* వ్యాసానికి ఎంచుకున్న అంశం (టాపిక్) సందర్భాన్ని అభ్యర్థి సరిగా అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. లేకపోతే ఆ అంశానికి న్యాయం చేయలేము.
* అందుకే మొదటి 10 నిమిషాలూ టాపిక్ ఎంచుకోవటానికే వెచ్చించాలి.
* ఇచ్చిన సందర్భాన్ని సరిగా అర్థం చేసుకున్నామా లేదా అనేది ఒకటికి రెండుసార్లు నిర్థారించుకోవాలి.
* అంశం ఎంచుకున్నాక దాని గురించి మీ దగ్గరున్న సమాచారం గురించి పాయింట్లుగా రాయాలి.
* వాటిని తార్కిక పద్ధతిలో అమర్చాలి.
* ప్రతి పాయింటునూ రాసేటపుడు విస్తరిస్తూ రాయాలి. ఉదా: Judicial accountability and democracy అనే అంశం. ఈ క్రమంలో ముందుకుసాగవచ్చు-
The need for judicial accountability in a democracy
> The problems of ensuring judicial accountability in practice
> Significant features of the proposed judicial standards and accountability bill
> Mechanism for making the proposed bill effective.
కంపల్సరీ పేపర్లలో ముఖ్యాంశాలు గుర్తించాలి. తర్వాత ఇదే కసరత్తును ఆప్షనల్స్‌లో కూడా చేయాలి. వాటిపై మనసు కేంద్రీకృతం చేయాలి. ఇలాంటి ప్రయత్నం పరీక్షలో మంచి ఫలితాలను అందిస్తుంది.
భర్తీ చేయబోయే పోస్టుల సంఖ్య ఎక్కువుంది కాబట్టి 2011 సంవత్సరం అభ్యర్థులు ముందడుగు వేయటానికి సరైన సంవత్సరం. ఆత్మవిశ్వాసంతో విజయవ్యూహాన్ని ఆచరణలో పెడితే... మెయిన్స్‌లో విజయం సాధించి... ఇంటర్వ్యూ దశకు చేరుకున్నట్టే!
ఇవి గుర్తుంచుకోండి!
* జనరల్ స్టడీస్ పేపర్ పూర్తిగా అనూహ్యంగా ఉంటుంది. ఇలా ఉండటం అసాధారణమేమీ కాదు. అందుకని అందుకు మానసికంగా సిద్ధం కావాలి.
* ఎస్సే ప్రశ్నలు మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎక్కువ ప్రశ్నలు షార్ట్ నోట్సు, 5 మార్కులు, 10 మార్కులవి ఉండొచ్చు.
* అన్ని అంశాలనూ కవర్ చేయటం దాదాపు అసాధ్యం. అందుకని అలా చేయాలనుకోవద్దు.
* కిందటి సంవత్సరం విజేతల్లో చాలా తక్కువమందే 300/600 కంటే మించి స్కోర్ చేశారు. ఇదే ధోరణి కొనసాగుతుంది. అందుకని జనరల్‌స్టడీస్ సన్నద్ధతకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వొద్దు. దీనికంటే ఆప్షనల్స్‌పై దృష్టిపెట్టటం సముచితం. ఎందుకంటే మార్కుల నిష్పత్తి 2:1 ఉంటుంది.
సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రకటన రావటానికి ఇంకా 5 నెల్ల సమయముంది.
ఈ పరీక్షకు సిద్ధం కావాలని మీరు అభిలషిస్తుంటే మీకు అభినందనలు!
ప్రిలిమ్స్ పరీక్షా విధానం మార్చాక తొలిసారిగా పరీక్ష ఈ సంవత్సరం జూన్ లో జరిగింది. ఆ పరీక్షను విశ్లేషించుకుని కార్యాచరణ ప్రణాళిక వేసుకోవాలి కదా?
దాన్ని వివరించే ఈ వ్యాసం చదవండి. ‘చదువు’లో ప్రచురితమైంది ఇవాళ!

మాసాల్లో మార్గశిర మాసం గొప్పది అన్నట్టుగా... పరీక్షలన్నిట్లో ఏ పరీక్ష గొప్పదంటే ... వెనువెంటనే ఎవరైనా చెప్పే సమాధానం... సివిల్స్ !
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఈ సంవత్సరం కొత్త విధానం ప్రవేశపెట్టారు. దీని గురించి అభ్యర్థుల్లో ఎన్నెన్నో వూహాగానాలు ప్రచారమయ్యాయి.
వీటన్నిటికీ తెర దించుతూ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి, ఫలితాలూ ప్రకటించారు.
ప్రశ్నల స్వభావాన్ని విశ్లేషిస్తే తెలిసే అంశాలేమిటి?
.

No comments:
Post a Comment